చౌకీదార్ చోర్ హై అని నినదించిన చిన్నారులు.. చిక్కుల్లో ప్రియాంక గాంధీ
- ప్రియాంక ఎదురుగా పిల్లల నినాదాలు
- ఎన్నికల ప్రచారంలోకి పిల్లలు ఏంటంటూ ఎన్సీపీఆర్సీ ఆగ్రహం
- మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
ఇది కాస్తా జాతీయ బాలల హక్కుల సంఘం (ఎన్సీపీఆర్సీ) దృష్టిలో పడడంతో తీవ్రంగా స్పందించింది. ఎన్నికల ప్రచారంలోకి పిల్లలను తీసుకురావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిల్లల పేర్లు, పూర్తి వివరాలు, ఘటన ఎక్కడ జరిగిందీ తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. అంతేకాదు, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లింది.