ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ .. మంగళగిరిలో ఏడుగురి అరెస్టు!
- నిందితుల నుంచి రూ.10.15 లక్షలు స్వాధీనం
- ఒక కారు, 7 సెల్ ఫోన్స్ కూడా
- గుంటూరు అర్బన్ పోలీసుల వెల్లడి
నిందితుల నుంచి రూ.10.15 లక్షల నగదు, ఒక కారు, 7 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఈ బెట్టింగ్ లలో మధ్యవర్తులే కీలకం. బెట్టింగ్ కాసే వారు మధ్యవర్తులకు 5 శాతం కమిషన్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా, బాండ్ పేపర్లపై అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మంగళగిరిలో నారా లోకేశ్ గెలుస్తాడని రూ.300 కోట్ల మేరకు బెట్టింగ్ లు చేసినట్టు సమాచారం.