కొంచెం టైమ్ ఇవ్వండి .. మంచి కంటెంట్ తో వచ్చేస్తా: హీరో సిద్ధార్థ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొంచెం టైమ్ ఇవ్వండి .. మంచి కంటెంట్ తో వచ్చేస్తా: హీరో సిద్ధార్థ్

  • తెలుగు .. తమిళ భాషల్లో సిద్ధార్థ్ కి క్రేజ్ 
  • వరుస పరాజయాలతో వెనుకబడిన హీరో 
  • తెలుగు సినిమా చేసేందుకు ప్రయత్నాలు  
తెలుగు .. తమిళ భాషల్లో సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ వుంది. కెరియర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకున్న ఆయన, ఆ తరువాత అదేస్థాయిలో పరాజయాలను మూటగట్టుకున్నాడు. ఈ కారణంగా ఇక్కడ అవకాశాలు తగ్గడంతో, తమిళంలోనే తాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. అలాంటి సిద్ధార్థ్  తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు.

 "ఎవరేమనుకున్నా నేను వచ్చేస్తున్నానులే. తెలుగు ప్రేక్షకులారా నా ప్రామిస్ ను గుర్తుపెట్టుకోండి .. మంచి కంటెంట్ ను సిద్ధం చేశాను .. నాకు 18 నెలల సమయం ఇవ్వండి .. మిమ్మల్ని అలరించడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను. నేను ఆన్ ది వే .. మాట్లాడుకుందాం" అంటూ ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ఓ తెలుగు సినిమా చేయనున్నాడనే విషయం మాత్రం ఆయన ట్వీట్ వలన అర్థమవుతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పుడు చెబుతాడో చూడాలి మరి. 
siddhardh

More Telugu News