Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తనకు సెక్యూరిటీ కల్పించే మహిళా గార్డును పెళ్లి చేసుకున్న థాయ్ రాజు!

  • వజిరలోంగ్ కార్న్ సెక్యూరిటీలో సుతిద
  • ఆమెను వివాహం చేసుకున్న రాజు
  • వెల్లడించిన థాయ్ రాయల్ గెజిట్
థాయ్ లాండ్ రాజుగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న మహా వజిరలోంగ్ కార్న్, పట్టాభిషేకానికి రోజుల ముందు తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగంలోని మహిళను వివాహం చేసుకున్నారు. ఆపై ఆమె పేరును క్వీన్ సుతిదగా మార్చారు. థాయ్ రాయల్ గెజిట్ ఈ విషయాన్ని వెల్లడించి, వారి పెళ్లి దృశ్యాలను, చిత్రాలను విడుదల చేయగా, ప్రజలంతా ఆశ్చర్యపోయారు.

2016లో మహా వజిరలోంగ్ కార్న్ తండ్రి కింగ్ భుమిబోల్ అదుల్యదేజ్ మరణించగా, అప్పుడే పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఇక మహా వజిరలోంగ్ కార్న్ పేరు కింగ్ రామా టెన్త్ (ఎక్స్)గా మారనుంది. కాగా, మహా వజిరలోంగ్ కార్న్ కు గతంలో మూడు వివాహాలు జరిగాయి. ఆ ముగ్గురితోనూ విడాకులు తీసుకున్నారు. ఆయనకు ఏడుగురు పిల్లలున్నాయి.

ఇక సుతిద టిడ్జాల్ విషయానికి వస్తే, థాయ్ ఎయిర్ వేస్ లో ఫ్లయిట్ అటెండెంట్ గా పని చేస్తున్న ఆమెను 2014లో మహా వజిరలోంగ్ కార్న్, తన బాడీగార్డుల్లో డిప్యూటీ కమాండెంట్ గా నియమించుకున్నారు. సుతిదాను విమానంలో చూసి మనసుపారేసుకున్న మహా వజిరలోంగ్ కార్న్, ఆమెను పక్కనే పెట్టుకున్నారని గతంలో వార్తలు వచ్చినప్పటికీ, రాయల్ ప్యాలెస్ మాత్రం వాటిని ధ్రువీకరించలేదు.
Thai
Vajiralongkorn
Suthida Tidjai
Marriage

More Telugu News