రాహుల్‌కు క్షమాపణలు చెప్పేందుకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు
- ప్రధానిని చౌకీదార్ చోర్ అంటూ రాహుల్ వ్యాఖ్యలు
- సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన మీనాక్షి లేఖీ
- తామెక్కడా ఆ వ్యాఖ్యలు చేయలేదన్న సుప్రీం
దీనిపై ఏప్రిల్ 22న రాహుల్ అఫిడవిట్ దాఖలు చేశారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే విచారం అనే మాటను బ్రాకెట్లో ఉంచారంటూ మీనాక్షి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై తాను క్షమాపణలు చెబుతానని రాహుల్ తెలిపారు. ఈ విషయాన్ని నేడు సుప్రీంకోర్టుకు రాహుల్ తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వెల్లడించారు. దీంతో క్షమాపణలతో కూడా అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు కోర్టు రాహుల్‌కు మరో అవకాశం కల్పించింది.