బ్రేకింగ్... అదృశ్యమైన మూడో అమ్మాయి హత్య... ఇది కూడా సైకో శ్రీనివాస్ పనే!
- నాలుగేళ్ల క్రితం కనిపించకుండా పోయిన కల్పన
- రేప్ చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి
- విషయం బయటకు రావడంతో ప్రజల ఆగ్రహం
ఈ విషయం గ్రామంలో తెలియగానే ప్రజలు బీభత్సం సృష్టించారు. కల్పన అదృశ్యమైనట్టు అప్పుడే ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోలేదని, కల్పన మృతికి అప్పటి బొమ్మలరామారం ఎస్ఐ, యాదగిరిగుట్ట సీఐ కారణమంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తాము ముగ్గురు బిడ్డలను కోల్పోయామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, బొమ్మలరామారంలో నమోదైన మిస్సింగ్ కేసులను తిరగదోడుతున్న పోలీసులు, నేడు నిందితుడిని బావి వద్దకు తీసుకు వచ్చి కేసు రీకన్ స్ట్రక్షన్ చేయనున్నట్టు తెలిపారు.
పోలీసులు విడుదల చేసిన శ్రీనివాస్ రెడ్డి చిత్రం, ఇన్ సెట్లో కల్పన