తొమ్మిదేళ్లకే కొడుకు ప్రయోజకత్వం చూసి మురిసిపోతున్న తమిళ హీరో సూర్యా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొమ్మిదేళ్లకే కొడుకు ప్రయోజకత్వం చూసి మురిసిపోతున్న తమిళ హీరో సూర్యా

  • కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన దేవ్
  • ఢిల్లీ చాంపియన్ షిప్ లో జయకేతనం
  • కొడుకు ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన సూర్యా, జ్యోతిక
కొడుకు పుట్టినప్పుడు కాదు, అతడు ప్రయోజకుడు అయినప్పుడే ఆ తండ్రికి నిజమైన పుత్రోత్సాహం అని పెద్దలు చెప్పిన విషయం తమిళ హీరో సూర్యాకు అనుభవంలోకి వచ్చింది. సూర్యా, జ్యోతికల ముద్దుల తనయుడు తొమ్మిదేళ్ల దేవ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన 'జెన్ ఇషిన్ ర్యు' అఖిలభారత కరాటే చాంపియన్ షిప్ లో ఈ చిచ్చరపిడుగు అందరినీ ఓడించి విజేతగా అవతరించాడు.

ఈ కరాటే ఈవెంట్ లో ఒక్క తమిళనాడు నుంచే 40 మంది పోటీదారులు పాల్గొన్నా, దేవ్ తన ప్రతిభతో నిర్వాహకులను మెప్పించాడు. కుమారుడి ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టోర్నీ ఆసాంతం సూర్యా, జ్యోతిక ద్వయం వేదిక వద్దే గడిపింది. ఇక, దేవ్ టైటిల్ గెలవగానే సూర్యా ఆనందం అంతాఇంతా కాదు.
Suriya
Jyoyhika
Dev

More Telugu News