ప్రియుడితో కలిసి భార్య ప్లాన్... గుడ్డిగా నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న భర్త!
- హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ లో దారుణం
- భర్తకు విషం కలిపిన మద్యం ఇచ్చిన భార్య
- ఆపై ప్రియుడితో కలిసి ఊపిరాడకుండా చేసి హత్య
ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం, భర్త తాగే మద్యంలో విషం కలిపింది. ఆపై విషయం తెలియక పూటుగా తాగిన భర్త స్పృహ కోల్పోగానే, ఇద్దరూ కలసి దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆపై అతను విద్యుత్ షాక్ తో చనిపోయాడని నాటకం ఆడారు. మృతుడి బంధువులు వచ్చి అనుమానంతో పోలీసులను ఆశ్రయించగా, అసలు విషయం బయటకు వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, రిపోర్టు వచ్చిన తరువాత మరిన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు.