ప్రియుడితో కలిసి భార్య ప్లాన్... గుడ్డిగా నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న భర్త!

ప్రియుడిని వదిలి ఉండలేకపోయిన ఓ వివాహిత, అతనితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేయగా, విషయం తెలియని ఆ అమాయకుడు ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, హతుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి చైతన్యపురి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతని ఇంటికి వచ్చి వెళ్లే స్నేహితుడితో భార్య వివాహేతర బంధం ఏర్పరచుకుంది. ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన భార్య ప్రియుడితో కలసి నిన్న రాత్రి ఇంట్లో మందు పార్టీ ఏర్పాటు చేసింది.

ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం, భర్త తాగే మద్యంలో విషం కలిపింది. ఆపై విషయం తెలియక పూటుగా తాగిన భర్త స్పృహ కోల్పోగానే, ఇద్దరూ కలసి దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆపై అతను విద్యుత్ షాక్ తో చనిపోయాడని నాటకం ఆడారు. మృతుడి బంధువులు వచ్చి అనుమానంతో పోలీసులను ఆశ్రయించగా, అసలు విషయం బయటకు వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, రిపోర్టు వచ్చిన తరువాత మరిన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Wife
Murder
Dilsukhnagar

More Telugu News