అత్త కుమారుడి హత్య కేసులో కన్నడ సినీ నటి ప్రియాంక అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్త కుమారుడి హత్య కేసులో కన్నడ సినీ నటి ప్రియాంక అరెస్ట్

  • అత్త కుమారుడిని హత్య చేయించిన ప్రియాంక
  • డబ్బు కోసం వేధిస్తుండటంతో హత్య
  • ప్రియాంకతో పాటు ఆమె తల్లి అరెస్ట్
కన్నడ సినీ నటి ప్రియాంకతో పాటు ఆమె తల్లి నాగమ్మను చెన్నపట్టణ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంక పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. పేరు మోసిన రౌడీ సునీల్ హత్య కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 29న ఓ ఇంట్లో సునీల్ పై మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ హత్యలో ప్రియాంక, నాగమ్మల ప్రమేయం ఉందని నిర్ధారించిన పోలీసులు, వీరిని అరెస్ట్ చేశారు.

ప్రియాంక అత్త కుమారుడే సునీల్. ప్రియాంక కారు డ్రైవర్ గా వ్యవహరిస్తుండేవాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్ ను డ్రైవర్ పని నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో, ఫోన్లు చేస్తూ డబ్బు కోసం తల్లీకూతుళ్లను వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేకే సునీల్ ను హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులో వీరి పేర్లు బయటకు రావడంతో, ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రామనగర్ లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
kannada
actress
priyanka
arrest
murder

More Telugu News