బొమ్మలరామారం విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు.. పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు
- తెలంగాణలో సంచలనం సృష్టించిన ఘటన
- ఘటనా స్థలంలోని బీరు బాటిళ్ల నుంచి వేలిముద్రల సేకరణ
- నిందితుల వేలి ముద్రలతో పోల్చి చూస్తున్న నిపుణులు
సాయంత్రం ఆమె మృతదేహం 50 అడుగుల లోతున్న ఎండిపోయిన బావిలో కనిపించింది. నిందితులు బాలికను వెంటాడి పట్టుకుని ఉంటారని, ఆ తర్వాత ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉంటారని, ఆపై హత్య చేసి బావిలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఘటనా స్థలంలో ఉన్న బీరు బాటిళ్లపై ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఏడుగురు అనుమానితులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వేలిముద్రలను నిందితుల వేలిముద్రలతో పోల్చి చూస్తున్నారు.