కోల్‌కతా మ్యాచ్‌లో కుమ్మేసిన పాండ్యా.. అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు
- కోల్‌కతా బౌలర్లను ఉతికి ఆరేసిన పాండ్యా
- 34 బంతుల్లో 9 సిక్సర్లతో 91 పరుగులు
- రిషభ్ పంత్ రికార్డు బద్దలు
మైదానంలో పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. తొలుత 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పాండ్యా ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాతి 17 బంతుల్లో మరో 41 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న పాండ్యా 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. కాగా, మార్చి 24న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇప్పుడా రికార్డును పాండ్యా తిరగరాశాడు.