మరో 10 గంటల్లో పెరగనున్న ఫణి తుపాను తీవ్రత: విశాఖ వాతావరణ శాఖ
- రాగల 12 గంటల్లో బలపడనున్న తుపాను
- తమిళనాడు, కోస్తాంధ్ర సమీపంలో కేంద్రీకృతం
- గంటకు 45-50 కి.మీ. వేగంతో గాలులు
- మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
తీరం వెంబడి గంటకు 45-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫణి తుపాను కారణంగా మే 2 నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.