జమ్మలమడుగులో ఇసుక మాఫియా బీభత్సం.. ఏకంగా పోలీసులపైనే దాడి!

  • అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులకు సమాచారం
  • తనిఖీలకు వెళ్లి అడ్డుకున్న పోలీసులు
  • కర్రలు, పారలతో అధికారులపైనే దాడి
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఈరోజు ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకున్నందుకు పోలీస్ అధికారులనే చితకబాదింది. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా, పలువురికి గాయాలయ్యాయి. జమ్మలమడుగు శివారులో ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తున్నట్లు ఈరోజు పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడికి వెళ్లగా, ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా సభ్యుడు ‘ఎంత ధైర్యం ఉంటే మా ట్రాక్టర్ ను ఆపుతారు?’ అని విరుచుకుపడ్డారు.

ట్రాక్టర్లలోని కర్రలు, పారలతో దాడికి దిగారు. ఈ ఘటనలో వీరాంజనేయులు అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి చేసిన అనంతరం ఇసుక మాఫియా సభ్యులు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.
Go Back to Shorts
Andhra Pradesh
Kadapa District
jammala madugu
attack on police

More Telugu News