నారా లోకేశ్ ఓటమి ఖాయమట... కారణాలివేనంటున్న వైసీపీ!
- అందరి దృష్టినీ ఆకర్షించిన మంగళగిరి
- టీడీపీ తరఫున లోకేశ్, వైసీపీ తరఫున ఆళ్ల పోటీ
- గెలుపుపై ఇరు పార్టీల ధీమా
రాజధాని ప్రాంతంలో భూములపై వైసీపీ పోరాటం చేసినందున రైతుల మద్దతు తమకే ఉందని, తాడేపల్లి పరిధిలోని భూములను గ్రీన్ బెల్ట్ నుంచి తొలగించి, వాటిని అమ్ముకునే సదుపాయం కల్పిస్తామన్న కీలక హామీ పని చేసిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలుగుదేశం వస్తే ఇక్కడి ప్రభుత్వ భూములను ఐటీ కంపెనీలకు ఇస్తుందనే భయం కారణంగా, ఆ భూముల్లో నివాసం ఏర్పరుచుకున్న 30 వేల మంది తమ పార్టీకే ఓటు వేశారని అంటున్నారు. ఇదే సమయంలో ఆర్కే ప్రారంభించిన రాజన్న రైతు బజార్, రాజన్న క్యాంటీన్ తదితరాలు ఎంతో మందికి మేలు చేకూర్చాయని, ఇవన్నీ ఓట్ల రూపంలో ఆయనపై కురిశాయని చెబుతున్నారు. ఏదేమైనా విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.