ఓ హోటల్లో పార్టీ.. అనంతరం కూకట్పల్లిలో రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులు
- పార్టీ సమయంలో విద్యార్థుల మధ్య మనస్పర్థలు
- ఫార్చూన్ బిజినెస్ స్కూలు విద్యార్థులుగా గుర్తింపు
- దాడి ఘటనలో ఓ మహిళకు గాయాలు
ఈ అనూహ్య పరిణామంతో అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. విద్యార్థుల దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థుల మధ్య గొడవకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.