ఇండియాలో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' తొలిరోజు వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇండియాలో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' తొలిరోజు వసూళ్లు

  • చైనాలో రికార్డు స్థాయి వసూళ్లు 
  • ఇండియాలో భారీస్థాయి విడుదల 
  • ఆశ్చర్యచకితులను చేస్తోన్న తొలిరోజు వసూళ్లు    
చైనాలో రికార్డుస్థాయి వసూళ్లతో దూసుకుపోతోన్న 'అవెంజర్స్ ఎండ్ గేమ్' .. నిన్న ఇండియాలో భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, అదే స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇండియాలో అన్ని భాషల్లో కలుపుకుని, తొలిరోజున ఈ సినిమా 63 కోట్ల 21 లక్షల గ్రాస్ ను .. 53 కోట్ల 10 లక్షల షేర్ ను వసూలు చేసింది.

ఇండియాలో ఏ ఇంగ్లిష్ సినిమాకి కూడా తొలిరోజున ఈ స్థాయి వసూళ్లు దక్కలేదని చెబుతున్నారు. ఈ ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక ఈ రోజు .. రేపు వసూళ్లు కూడా రికార్డు స్థాయిలో వుండనున్నట్టుగా చెబుతున్నారు. ఇంతకుముందు వచ్చిన 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' ఇక్కడ 2000 థియేటర్స్ లో విడుదలై, 31 కోట్ల 30 లక్షల షేర్ ను రాబట్టింది. ఇక ఇప్పుడు 'అవెంజర్స్ ఎండ్ గేమ్' 2800 స్క్రీన్లలో విడుదలై 53 కోట్ల 10 లక్షల షేర్ ను సాధించడం విశేషం.
avengers endgame

More Telugu News