స్పోర్ట్స్ నేపథ్యంలో కీర్తి సురేశ్ సినిమా
- నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేశ్
- పూణేలో జరుగుతోన్న షూటింగు
- సెప్టెంబర్లో విడుదల చేసే ఆలోచన
ఆయన తాజా చిత్రానికి సుధీర్ చంద్ర - శ్రావ్యవర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తారనీ .. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడని చెప్పుకున్నారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్స్ లేవు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందేమోనని అనుకున్నారు. కానీ సైలెంట్ గా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోందట. ప్రస్తుతం పుణేలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. త్వరలో టైటిల్ ను ఖరారు చేసుకుని, సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు.