ఈ నెల 29న ‘చలో ఇంటర్ బోర్డు’ నిర్వహిస్తాం.. ఎవరు అడ్డుకున్నా ఆగబోం!: టీజేఎస్ చీఫ్ కోదండరాం
- బోర్డు నిర్లక్ష్యం కారణంగా 23 మంది బలయ్యారు
- కేసీఆర్ తీరిగ్గా స్పందించడం బాధ్యతారాహిత్యమే
- హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కోదండరాం
ఎవరు అడ్డుకున్నా ‘చలో ఇంటర్ బోర్డు’ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న అనంతరం, 5-6 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ తీరిగ్గా స్పందించడం దారుణమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ ఒక్క పరీక్షను కూడా ప్రభుత్వం సక్రమంగా నిర్వహించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.