దిల్ రాజు మూవీతో అవికా గోర్ రీ ఎంట్రీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ రాజు మూవీతో అవికా గోర్ రీ ఎంట్రీ

  • స్లిమ్ గా మారిపోయిన అవికా గోర్
  • 'ఇద్దరిలోకం ఒకటే'లో ఛాన్స్ 
  • సాయితేజ్ సినిమాలోనూ అవకాశం 
'చిన్నారి పెళ్లికూతురు' ధారావాహికతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అవికా గోర్, ఆ క్రేజ్ తో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమైంది. 'ఉయ్యాలా జంపాల' చిత్రం ద్వారా ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రాజ్ తరుణ్ జోడీగా ఈ అమ్మాయి చేసిన సందడి యూత్ కి బాగా నచ్చేసింది. దాంతో ఈ అమ్మాయికి ఇక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. అయితే అలా అవకాశాలు వస్తుండగానే ఈ అమ్మాయి తెలుగు సినిమాలను దూరం పెట్టింది. అందుకు అనేక కారణాలు వినిపించాయి.

అవన్నీ అటుంచితే ఈ అమ్మాయి ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. స్లిమ్ గా మారిన ఈ అమ్మాయి దిల్ రాజు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా ఆయన నిర్మిస్తోన్న 'ఇద్దరి లోకం ఒకటే'లో ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. అంతేకాదు సాయితేజ్ హీరోగా మారుతి చేయనున్న సినిమాలోను ఆమెకి అవకాశం దక్కిందని అంటున్నారు. ఇకనైనా అవికా ఇక్కడ వరుస సినిమాలు చేస్తుందేమో చూడాలి.
avika gor

More Telugu News