ఉన్నతాధికారుల వేధింపులు.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన గుంటూరు రైల్వే ఉద్యోగి!
- గుంటూరు రైల్వేస్టేషన్ లో ఘటన
- ఉన్నతాధికారుల నుంచి పవన్ కు వేధింపులు
- ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
గుంటూరులోని రైల్వేస్టేషన్ లో పవన్ కుమార్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవలికాలంలో ఆయనకు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురయిన పవన్ కుమార్ ఈరోజు ఆఫీసుకు వచ్చాడు. అనంతరం ‘ఈ వేధింపులను నేను భరించలేను. చచ్చిపోతా’ అంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు.
పక్కనే ఉన్న తోటి ఉద్యోగులు ఈ సందర్భంగా పవన్ ను అడ్డుకున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదుచేయలేదు. బాధితుడు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని గుంటూరు పోలీసులు స్పష్టం చేశారు.