ఏ ఒక్క అంశంలోనూ సొంత నిర్ణయం తీసుకోవడం లేదు: చంద్రబాబు లేఖపై ద్వివేది స్పందన

  • పార్టీ అభ్యర్థులు, అధికారులకు నియమావళి ఇచ్చాం  
  • ఆ నియమావళి ప్రకారమే పని చేస్తున్నా
  • రాజకీయ అంశాలపై తాను మాట్లాడలేదన్న సీఈవో  
ఈసీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు తొమ్మిది పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై సీఈవో ద్వివేది స్పందించారు. సీఈసీ నుంచి వచ్చిన ఆదేశాలనే అమలు చేస్తున్నానని అన్నారు. పార్టీలు, అభ్యర్థులు, అధికారులకు నియమావళి పుస్తకాలు అందించామని, ఆ నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నానని, ఏ ఒక్క అంశంలోనూ సొంత నిర్ణయం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజకీయ అంశాలపై తాను మాట్లాడలేదని, ఇతర రాష్ట్రాల్లో ఈసీ అధికారుల విషయాన్ని సీఈసీ చూసుకుంటుందని అన్నారు.
Go Back to Shorts
CM
Chandrababu
CEC
Dwivedi

More Telugu News