సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వరుసగా రానున్న సినిమాలు ఇవే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వరుసగా రానున్న సినిమాలు ఇవే

  • కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తోన్న సురేశ్ ప్రొడక్షన్స్ 
  • చిన్న సినిమాలకి ప్రోత్సాహం 
  • త్వరలోనే విడుదల తేదీల ప్రకటన  
సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అందులో ఏదో కొత్తదనం వుంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వుంది. ఆ క్రేజ్ ను అలా నిలబెట్టుకుంటూ, సురేశ్ బాబు ఎప్పటికప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కొత్త కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తూ తమ బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ బ్యానర్ నుంచి వరుసగా 6 సినిమాలు థియేటర్లకు రానున్నాయి.

సమంత ప్రధాన పాత్రధారిగా చేస్తోన్న 'ఓ బేబీ' .. అల్లు శిరీశ్ హీరోగా చేసిన 'ఏబీసీడీ' .. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తోన్న 'దొరసాని' .. నివేద థామస్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'బ్రోచేవారెవరురా' .. 'ఫలక్ నుమా దాస్' .. 'మల్లేశం' సినిమాలు సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వరుసగా విడుదల కానున్నాయి. ఈ సినిమాల విడుదల తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిన్న సినిమాల్లో పెద్ద విజయాలను అందుకునేవేవో చూడాలి మరి
suresh babu

More Telugu News