ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
  • నిన్న నాంపల్లి కోర్టులో కొండాకు చుక్కెదురు
  • విశ్వేశ్వర్ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు
పోలీసులను నిర్బంధించారన్న ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం నిన్న నాంపల్లి కోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించడంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
Go Back to Shorts
chevella
mp
konda visveswar reddy
High Court

More Telugu News