లక్ష్మీపార్వతి వేసిన కేసులో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దు!

  • 2005లో ఏసీబీ కోర్టును ఆశ్రయించిన లక్ష్మీపార్వతి
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో రద్దయిన స్టే
  • మే 13న విచారణ ప్రారంభిస్తామన్న కోర్టు
చంద్రబాబునాయుడిపై నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, అప్పట్లో హైకోర్టు నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో, ఈ స్టే రద్దుకాగా, కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని లక్ష్మీ పార్వతికి సమన్లు అందాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆమె ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను ప్రారంభించిన కోర్టు, కేసు స్టేటస్ పై మే 13న విచారిస్తామని స్పష్టం చేస్తూ, వాయిదా వేసింది.
Go Back to Shorts
Chandrababu
Stay
ACB Court
Lakshmi Parvati

More Telugu News