Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియురాలు మాట్లాడటం లేదని... ఉరేసుకున్న కుర్రాడు!

  • ఇటీవలే టెన్త్ రాసిన నరేశ్
  • వారం నుంచి మాట్లాడని బాలిక
  • మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య
తాను ప్రేమిస్తున్న అమ్మాయి మాట్లాడటం లేదన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరేసుకుని మరణించిన ఘటన హైదరాబాద్, ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన యాదయ్య కుమారుడు నరేశ్ (16), ఇటీవలే టెన్త్ పరీక్షలు రాశాడు. ప్రస్తుతం సెలవులు కావడంతో చాంద్రాయణగుట్టలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు.

23వ తేదీన పనికి వెళ్లిన నరేష్‌, తనకు నైట్‌ షిప్ట్‌ ఉందని, ఇంటికి రాలేనని చెప్పాడు. 24 ఉదయం తల్లిదండ్రులు పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లగా, సాయంత్రం 5 గంటల సమయంలో నరేశ్ ఇంటికి వచ్చాడు. ఆపై కాసేపటికి తల్లి వచ్చి తలుపులు తట్టినా స్పందించలేదు. స్థానికుల సహాయంతో తలుపులు తీసి చూడగా, నరేష్‌ ఉరేసుకొని కనిపించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు, కొంతకాలంగా ఓ బాలికతో నరేష్‌ ప్రేమలో ఉన్నాడని, ఆమె ప్రస్తుతం మాట్లాడటం లేదని, అందువల్లే నరేశ్ సూసైడ్ చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. చెడు స్నేహాల కారణంగానే తమ కుమారుడు దూరమయ్యాడని యాదయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
Hyderabad
Police
Sucide

More Telugu News