​ ప్రజ్ఞా సింగ్ గురించి తెలిస్తే ఆమెను సాధ్వి అనరు.. ఓ యువకుడ్ని ఆమె కత్తితో పొడిచారు: ఛత్తీస్ గఢ్ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

​ ప్రజ్ఞా సింగ్ గురించి తెలిస్తే ఆమెను సాధ్వి అనరు.. ఓ యువకుడ్ని ఆమె కత్తితో పొడిచారు: ఛత్తీస్ గఢ్ సీఎం తీవ్ర వ్యాఖ్యలు

  • బిలైగడ్ వీధుల్లో కత్తి పట్టుకుని తిరిగారు
  • ఎక్కడ గొడవ జరిగితే అక్కడ ప్రజ్ఞా సింగ్ ఉంటారు
  • ఆమె నడవడిక ఓ క్రిమినల్ లాగా ఉండేది
కొన్నాళ్లుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాధ్వీ ప్రజ్ఞా సింగ్. బీజేపీ నేత అయిన ప్రజ్ఞా సన్యాసిని వస్త్రధారణతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కనిపిస్తారు. అయితే, ఆమె గురించి తెలిసినవాళ్లు ఎవ్వరూ సాధ్వి అనరని, ఒకప్పుడు కత్తి పట్టుకుని తిరిగేవారని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేవ్ బఘేల్ వ్యాఖ్యానించారు. వీధుల్లో కత్తి పట్టుకుని తిరిగిన ఘనచరిత్ర ప్రజ్ఞా సింగ్ సొంతమని అన్నారు. 2001లో బిలైగఢ్ లో జరిగిన ఘర్షణల్లో ఆమె ఓ యువకుడ్ని కత్తితో పొడిచారని బఘేల్ ఆరోపించారు.

ఎక్కడ గొడవ జరిగితే అక్కడ ప్రజ్ఞా సింగ్ ఉండేవారని తెలిపారు. ఆమె ప్రవర్తన చూస్తే ఓ క్రిమినల్ లాగా ఉండేది తప్ప సాధ్విలా ఎంతమాత్రం ఉండేది కాదన్నారు. అయితే, ఛత్తీస్ గఢ్ సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ పై చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలని, లేకపోతే క్షమాపణలు చెప్పాలని మధ్యప్రదేశ్ బీజేపీ నేత హితేశ్ బాజ్ పాయి డిమాండ్ చేశారు.
Pragya Singh
Bhupesh Baghel

More Telugu News