ఎల్వీ సుబ్రహ్మణ్యం, జగన్ కలసి మోదీకి కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నారు!: టీడీపీ నేత పంచుమర్తి అనురాధ
- ఆర్టికల్ 172 కింద సీఎంకు సమీక్షాధికారం ఉంటుంది
- ఈ విషయంలో సీఎస్ అబద్ధాలు చెప్పారు
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
రాజ్యంగానికి తూట్లు పొడిచేలా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైసీపీ అధినేత జగన్ కలసి ప్రధాని మోదీకి కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎస్ ఓ ప్రభుత్వాధికారిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈసారి కూడా టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అనురాధ జోస్యం చెప్పారు.