అవెంజర్సా... మజాకా?... టికెట్లకు ఫుల్ డిమాండ్!
- శుక్రవారం విడుదల కానున్న 'అవెంజర్స్: ఎండ్ గేమ్'
- తమ పిల్లల కోసం క్యూలో నిలబడ్డ తల్లిదండ్రులు
- ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్
ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థార్, బ్లాక్ విడో, వార్ మెషీన్, కెప్టెన్ మార్వెల్ తదితరులు థానోస్ ను ఎలా ఎదుర్కొంటారో చూసేందుకు చిన్నారులతో పాటు పెద్దలు సైతం ఆసక్తిని చూపుతుండటంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని థియేటర్లలో వారాంతం వరకూ టికెట్ల బుకింగ్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక నిన్న 'అవెంజర్స్ : ఎండ్ గేమ్' అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభం కాగా, హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ వద్ద టికెట్ల కోసం క్యూ సుమారు కిలోమీటర్ దూరం సాగడం గమనార్హం. ఈ వేసవిలో తమ పిల్లలకు సినిమాను చూపించేందుకు తల్లిదండ్రులు క్యూలో నిలబడటం గమనార్హం.