పైశాచికత్వానికి పరాకాష్ఠ.. ఓ యువకుడి పట్ల అమానుష ప్రవర్తన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పైశాచికత్వానికి పరాకాష్ఠ.. ఓ యువకుడి పట్ల అమానుష ప్రవర్తన!

  • కారులో తిప్పుతూ  తీవ్రంగా కొట్టి గుండు గీయించిన వైనం
  • దాన్ని వీడియోతీసి రాక్షసానందం
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
పైశాచికత్వానికి ఇది పరాకాష్ఠ. ఓ అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ యువకుడిని చిత్రహింసలకు గురిచేసి కొందరు రాక్షసానందాన్ని పొందారు. హైదరాబాదులోని బంజారా హిల్స్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని ఫస్ట్‌లాన్సర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ మన్సూర్ ఆలీఖాన్‌ అలియాస్‌ నసీర్‌ (19) అనే విద్యార్థికి సోమవారం ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు.

 ఓ యువతి విషయమై మాట్లాడాలని, జీవీకే వన్‌ మాల్‌ వద్దకు రావాలని కోరాడు. దీంతో నసీర్‌ అక్కడికి వెళ్లాడు. అక్కడ ఇబ్రహీంఖాన్‌ అనే వ్యక్తితోపాటు మరికొందరు కారుతో సిద్ధంగా ఉన్నారు. నసీర్‌ రాగానే అతన్ని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అనంతరం అక్బర్‌బాగ్‌, సైదాబాద్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో తిప్పుతూ  తీవ్రంగా కొట్టారు. దీంతో అతని ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. తమ చర్యను వీడియోతీసి మరింత ఆనందించారు.

అనంతరం ఓ సెలూన్‌కు తీసుకువెళ్లి అతనికి గుండుకొట్టించారు. తర్వాత అతని వద్ద ఉన్న ఐదువేల నగదు, సెల్‌ఫోన్‌ తీసుకుని అరాంఘర్‌ క్రాస్‌రోడ్డు వద్ద అతన్ని పడేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నసీర్‌ బంజారా హిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే దాడి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇబ్రహీంఖాన్‌ తదితరులపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Hyderabad
banjarahills
manhandling

More Telugu News