శ్రీలంక పేలుళ్ల మృతుల్లో బంగ్లాదేశ్ ప్రధాని బంధువుల అబ్బాయి!
- తండ్రితో కలిసి హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా ఘటన
- పేలుళ్లలో మొత్తం 38 మంది విదేశీయుల దుర్మరణం
- బ్రిటన్కు చెందిన యువ తోబుట్టువులు కూడా మృతి
శ్రీలంక పేలుళ్లలో మొత్తం 38 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోగా అందులో జయాన్ ఒకడు. అలాగే, బ్రిటన్ టీనేజ్ తోబుట్టువులైన అమెలీ (15), డేనియల్ లిన్సీ (19) కూడా దుర్మరణం పాలయ్యారు. హాలీడేను ఎంజాయ్ చేయడానికి వచ్చిన వీరు టూర్ చివరి రోజున ప్రాణాలు కోల్పోయారు. కాగా, పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 321 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.