సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో సినిమాకి ఓకే చెప్పిన రకుల్ 
  • మరోసారి 'అర్జున్ రెడ్డి'గా విజయ్ దేవరకొండ 
  • బాలీవుడ్ మిత్రుడికి చరణ్ డబ్బింగ్ 
  • ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో చైతూ  
*  ప్రస్తుతం నాగార్జున సరసన 'మన్మథుడు 2'లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ దీని తర్వాత నితిన్ తో ఓ చిత్రం చేయనుంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందే చిత్రంలో నటించడానికి రకుల్ ఓకే చెప్పింది.
*  విజయ్ దేవరకొండ నటించిన 'ద్వారక' చిత్రాన్ని తమిళంలోకి అనువదించారు. విశేషం ఏమిటంటే, విజయ్ కు ఎంతగానో పేరు తెచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం టైటిల్ని ఈ డబ్బింగ్ వెర్షన్ కి పెట్టారు. ఈ శుక్రవారం ఇది తమిళనాట విడుదలవుతోంది.
*  టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తన బాలీవుడ్ మిత్రుడు సల్మాన్ ఖాన్ కి గాత్రాన్ని ఎరువిస్తున్నాడు. సల్మాన్ నటించిన 'భారత్' చిత్రం తెలుగు వెర్షన్ లో సల్మాన్ పాత్రకి చరణ్ డబ్బింగ్ చెబుతున్నాడు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.
*  తాజాగా 'మజిలీ' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం 'వెంకీమామ' చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తాడట.
Rakul
Nagarjuna
Nithin
Vijay

More Telugu News