ఏపీలో జనసేన ఆఫీసుల మూసివేత వార్తలపై స్పందించిన పవన్ కల్యాణ్!
- నియోజకవర్గాల్లో ఆఫీసులు కొనసాగుతాయి
- ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
- పార్టీ అభ్యర్థులకు జనసేనాని దిశానిర్దేశం
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేననీ, జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.