గుజరాత్ అల్లర్ల సమయంలో గ్యాంగ్ రేప్ కు గురైన మహిళకి రూ.50 లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం!
- బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు
- బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశం
- 2002లో మతఘర్షణల సందర్భంగా దారుణం
ఈ సందర్భంగా బానో తల్లి, చెల్లి, కుమార్తె, ఇతర బంధువులను దుండగులు కత్తులతో నరికి చంపారు. 19 ఏళ్లకే గర్భిణిగా ఉన్న బానోను కూడా వారు విడిచిపెట్టలేదు. ఆమెపై 22 సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి చనిపోయినట్లు నటించిన బానో, వారి బారి నుంచి తప్పించుకుంది. ఆమె కుటుంబంలో చివరికి బానోతో పాటు ఇద్దరు మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో బానో పోలీసులను ఆశ్రయించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
వైద్యులు కూడా సహకరించలేదు. చివరకు 2004లో ఈ అఘాయిత్యంపై కేసు నమోదయింది. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడ్డ 11 మందికి ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. అంతకుముందు గుజరాత్ ప్రభుత్వం బానోకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా, ఆమె దాన్ని తిరస్కరించారు.