పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు భారీ కుట్ర.. ఓటుకు రూ.3 వేలు పంచారు!: సీపీఐ నేత రామకృష్ణ సంచలన ఆరోపణ
- ఏపీలో నగదు వరదను పారించారు
- జగన్ కు కేసీఆర్ రూ.600 కోట్లు ఇచ్చారు
- విజయవాడలో మీడియాతో సీపీఐ నేత
ప్రస్తుతం డబ్బున్నవారే ఏపీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు సమీక్షలు చేయకూడదని ఈసీ మాట్లాడుతోందనీ, ఎన్నికల్లో ధన ప్రవాహం ఈసీకి కనిపించలేదా? అని రామకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ కు రూ.600 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.
పోలీసుల తనిఖీల్లో డబ్బులు దొరికిన ప్రతీ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమయిందనీ, ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.