తెలుగు చిత్రపరిశ్రమ చెన్నై నుంచి వచ్చేశాక అక్కడ చాలా ఇబ్బంది పడ్డాము: శుభలేఖ సుధాకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు చిత్రపరిశ్రమ చెన్నై నుంచి వచ్చేశాక అక్కడ చాలా ఇబ్బంది పడ్డాము: శుభలేఖ సుధాకర్

  • స్నేహితులను జాబ్ అడిగాను
  • మళ్లీ హోటల్లో పనిచేయాలనుకున్నాను
  •  టీవీ సీరియల్స్ ఆదుకున్నాయి
తెలుగు .. తమిళ భాషల్లో నటుడిగా శుభలేఖ సుధాకర్ కి మంచి గుర్తింపు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తను చెన్నై నుంచి హైదరాబాద్ కి రాకపోవడానికి గల కారణాన్ని గురించి ప్రస్తావించారు. "తెలుగు .. తమిళ సినిమాలకి సంబంధించిన పనులకు చెన్నై కేంద్రస్థానంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్రపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చేసింది.

దాంతో అక్కడ మాకు పని లేకుండా పోయింది. ఏం చేయాలో పాలుపోలేదు .. చాలా ఇబ్బందులు పడ్డాము. స్నేహితులకి సంబంధించిన సంస్థల్లో ఉద్యోగం అడిగితే వాళ్లు సీరియస్ గా తీసుకోలేదు. సినిమాల్లోకి రావడానికి ముందు నేను హోటల్లో పనిచేశాను. అదే పనికి మళ్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలాంటి సమయంలోనే టీవీ సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి .. నెలకి 30 రోజులూ పని  దొరికింది. టీవీ సీరియల్స్ ఆదుకోవడంతో అక్కడే ఉండిపోయాము" అని చెప్పుకొచ్చారు.
subhalekha sudhakar

More Telugu News