దర్శకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న శంకర్.. దర్శకుల సెలెబ్రేషన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న శంకర్.. దర్శకుల సెలెబ్రేషన్!

  • భారీ సినిమాల దర్శకుడిగా శంకర్
  •  వినోదంతో పాటు సందేశానికి ప్రాధాన్యత
  • దర్శకులంతా కలిసి చేసిన సందడి
శంకర్ పేరు వినగానే ఘన విజయాలను అందుకున్న భారీ చిత్రాలు గుర్తుకొస్తాయి. వినోదంతో పాటు సందేశాన్ని కలిపి అందిస్తూ సంచలన విజయాలను నమోదు చేసిన సినిమాలు కళ్లముందు కదలాడతాయి. శంకర్ తో సినిమా చేస్తే అది తమ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని స్టార్ హీరోలకి కలిగించిన గొప్పతనం శంకర్ సొంతం. 'జెంటిల్ మేన్' .. 'భారతీయుడు' .. 'అపరిచితుడు' .. 'ఒకే ఒక్కడు' .. 'రోబో' మొదలైన చిత్రాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి.

కథాకథనాల పరంగానే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా దక్షిణాది సినిమా స్థాయిని పెంచిన శంకర్, దర్శకుడిగా 25 వసంతాలను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తమిళనాట ప్రముఖ దర్శకులంతా, 'రీ యూనియన్ మీట్' పేరుతో శంకర్ ను కలిసి శుభాకాంక్షలు అందజేశారు. బ్లూ అండ్ బ్లూ యూనిఫామ్ లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మణిరత్నం వంటి సీనియర్ దర్శకుల నుంచి, అట్లీ కుమార్ వంటి వర్ధమాన దర్శకుల వరకూ పాల్గొనడం విశేషం. 
shankar
manirathnam
gowtham menon

More Telugu News