శ్రీలంక పేలుళ్ల ఘటనలో 290కి చేరిన మృతుల సంఖ్య
- గాయపడిన వారి సంఖ్య 500 లు పైమాటే
- 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- దేశవ్యాప్తంగా కర్ప్యూ ఎత్తివేత
ఇప్పటివరకు ఈ దాడులతో సంబంధం ఉన్న మొత్తం 24 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అధికారులు మరిన్ని పేలుడు ఘటనలకు ఆస్కారం ఉందన్న ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండి తనిఖీలు జరుపుతున్నారు. తాజాగా శ్రీలంక విమానాశ్రయం ప్రాంతంలో అమర్చిన ఓ పైపు బాంబును నిర్వీర్యం చేశారు. నిన్న ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లతో దేశవ్యాప్తంగా కర్య్పూ విధించిన ప్రభుత్వం దాన్ని ఎత్తివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది.