'ఏసుక్రీస్తు'పైనా రక్తం చిందింది! శ్రీలంక దాడుల తీవ్రతకు అద్దం పడుతున్న ఫొటో ఇది!
- నెత్తురోడిన చర్చిలు
- ఈస్టర్ రోజున తీవ్ర విషాదం
- శోకసంద్రంలా మారిన కొలంబో
ఓ చర్చిలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహం కూడా రక్తసిక్తమైపోయింది. భక్తుల తాలూకు రక్తం, మాంస ఖండాలు ఎగిరివచ్చి ఏసు విగ్రహంపై పడ్డాయి. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రార్థనమందిరాలు ఇప్పుడు నెత్తురోడాయి. ఎక్కడ చూసినా రక్తపు మడుగులు, ఛిద్రమైన శరీర అవయవాలు దర్శనమిస్తున్నాయి.


