తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు: ఫస్టియర్లో జిల్లా టాపర్.. ద్వితీయ సంవత్సరంలో తెలుగులో సున్నా మార్కులు
- ఫస్టియర్లో తెలుగులో 98 మార్కులు
- ద్వితీయ సంవత్సరంలో సున్నా మార్కులు
- 25 వేల మంది విద్యార్థులకు చేదు అనుభవం
ఇది ఆ అమ్మాయి ఒక్కరి పరిస్థితే కాదు.. దాదాపు 25 వేల మంది విద్యార్థులుకు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. అధికారులు ఇష్టారాజ్యంగా పేపర్లు దిద్దడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.