కేసీఆర్ కు ఓటమి భయం.. అందుకే ముందుగా ఎన్నికలకు వెళుతున్నారు!: డీకే అరుణ
- చట్టాల సవరణపై ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
- టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే
- నల్గొండ కార్యవర్గ సమావేశంలో బీజేపీ నేత
రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారా? లేక రెవిన్యూ అధికారులు పాల్పడుతున్నారా? అని అరుణ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలంతా మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుంకుటున్నారని అభిప్రాయపడ్డారు.