బంతి స్టేడియం దాటింది బ్రో... 'జెర్సీ' మూవీపై ఎన్టీఆర్ స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంతి స్టేడియం దాటింది బ్రో... 'జెర్సీ' మూవీపై ఎన్టీఆర్ స్పందన

  • నీ ప్రదర్శన అమోఘం
  • తిరుగులేని నటనకు ఫిదా అయ్యాను
  • చాలాకాలం గుర్తుండిపోయే ప్రదర్శన ఇది
టాలీవుడ్ యువ హీరో నాని నటించిన జెర్సీ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుండా ఉండలేకపోయారు. ట్విట్టర్ లో తన స్పందన వెలిబుచ్చారు. "నానీ బ్రో... నువ్వు కొట్టిన షాట్ కు బంతి స్టేడియం దాటింది. నీ నటనా ప్రతిభ అద్భుతం, అద్భుతం, అద్భుతం! జెర్సీ చిత్రంలో నీ నటన చాలాకాలం గుర్తుండిపోతుంది. నిజంగా గర్విస్తున్నాను" అంటూ తన హర్షం వ్యక్తం చేశారు.

"ఈ సినిమా చూస్తున్నంత సేపు ఓ రోలర్ కోస్టర్ లో విహరించినంత అనుభూతి కలిగింది. ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి హ్యాట్సాఫ్ చెప్పాలి. తాను అనుకున్న పాయింట్ ను గురితప్పకుండా తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. గౌతమ్ కు అన్నివిధాలా సహకరించిన యూనిట్ సభ్యులందరికీ శుభాభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.

క్రికెట్ ఇతివృత్తంతో వచ్చిన జెర్సీ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.
NTR
Nani

More Telugu News