బీజేపీ నేత ప్రజ్ఞా స్వాధీ ‘శాపం’ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ!
- ఆ ఉగ్రవాదులకు-మీకు పెద్దగా తేడా లేదు
- అమరులను అవమానించడానికి బీజేపీకి ఎంత ధైర్యం?
- ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించిన మజ్లిస్ అధినేత
ఈరోజు ట్విట్టర్ లో అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ..‘హేమంత్ కర్కరే ఎవరితో అయితే పోరాడుతూ చనిపోయారో, వాళ్లకు-మీకు పెద్దగా తేడా లేదు. మీరు బాధపడ్డందుకు, శపించినందుకు కర్కరే చనిపోలేదు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును, ఓటేసే మన హక్కును కాపాడటం కోసం పోరాడుతూ అమరుడయ్యారు. మన అమరులను ఇలా అవమానించడానికి బీజేపీకి ఎంత ధైర్యం?’ అని నిలదీశారు.