తమ యజమాని ప్రాణాలను కాపాడేందుకు ఆత్మత్యాగం చేసిన నాలుగు శునకాలు... వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమ యజమాని ప్రాణాలను కాపాడేందుకు ఆత్మత్యాగం చేసిన నాలుగు శునకాలు... వీడియో!

  • నాలుగు శునకాలను పెంచుకుంటున్న డాక్టర్
  • ఇంట్లోకి వచ్చిన పాము
  • పాముతో పోరాడి ప్రాణాలు వదిలిన శునకాలు
తమ యజమాని ఇంట్లోకి వచ్చిన విష సర్పం బారి నుంచి కుటుంబ సభ్యులను కాపాడేందుకు ప్రయత్నించిన నాలుగు శునకాలు ఆత్మత్యాగం చేసిన హృదయ విదారక ఘటన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్ లోని భాగల్ పూర్ లో జరిగింది.

ఓ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న పూనమ్.. ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. దానికి రెక్స్ అనే ముద్దుపేరు పెట్టుకున్నాడు. దానికి క్యూటీ, బింగో, బ్లాకీ అనే మూడు పిల్లలు కూడా వున్నాయి. వాటన్నింటినీ పూనమ్ తన ఇంటి బిడ్డలుగానే పెంచుకుంటున్నాడు.

ఈ క్రమంలో రాత్రి వేళ, ఓ పాము ఆ ఇంట్లోకి వచ్చింది. దాన్ని గమనించిన శునకాలు దానితో పోరాడాయి. పాము కూడా ఏ మాత్రం తగ్గకుండా నాలుగు శునకాలనూ కాటేసింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. పాము కాటుకు గురైన నాలుగు శునకాలూ ప్రాణాలు విడిచాయి. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన పూనమ్ కుటుంబం, వారి నివాస ప్రాంతంలోనే వాటి అంత్యక్రియలను జరిపించారు.
dogs
Snake
Bite
Bihar
Died

More Telugu News