నా వ్యాసాలను ఈనాడు, జ్యోతి వేసుకోవు.. ఎక్కువ మందికి చేరాలంటే సాక్షి పత్రికే మార్గం!: బీజేపీ నేత ఐవైఆర్
- సాక్షిలో నా వ్యాసాన్ని కొందరు మెచ్చుకున్నారు
- ఇంకేదయినా పత్రికలో వచ్చి ఉంటే బాగుండేదన్నారు
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మాజీ సీఎస్
ఐవైఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఈరోజు సాక్షిలో వచ్చిన నా వ్యాసాన్ని మెచ్చుకుంటూ కొందరు ఇంకేదైనా పత్రికలో వచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఈనాడు, జ్యోతి వేసుకునే అవకాశాలు లేవు. ఎక్కువమంది పాఠకులు చదవాలంటే సాక్షి ఒక్కటే మార్గం. ఈ వ్యాసాలను నా బ్లాగ్ లో http://iyrtalks.com కూడా పొందు పరుస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.