Odisha: ఆరుబయట నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్ని తొక్కి చంపిన ఏనుగులు!

  • ఒడిశాలోని అనగూరు జిల్లాలో దారుణం
  • గ్రామంపై పడిన 14 ఏనుగులు
  • ఐదుగురు దుర్మరణం

ఒడిశాలో దారుణం జరిగింది. అటవీ ప్రాంతాల్లో ఆవాసం కరవై, పల్లెలపైకి దూసుకొస్తున్న ఏనుగులు, ఓ కుటుంబంలోని అందరి ప్రాణాలనూ హరించాయి. ఈ ఘటన అనగూరు జిల్లా సండపురంలో తీవ్ర కలకలం రేపింది. సమీపంలోని అడవుల నుంచి వచ్చిన ఏనుగుల మంద సండపురం గ్రామంపై పడి, గ్రామ శివార్లలోని ఆరుబయట నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలను బలిగొంది.

ఎండాకాలంలో ఇంట్లో నిద్రిస్తే ఉక్కపోతగా ఉందన్న కారణంగా, వీరంతా ఇంటి బయటే నేలపై నిద్రపోతుండగా, దాదాపు 14 ఏనుగులు గ్రామంపై పడ్డట్టు తెలుస్తోంది. ఇవన్నీ వారిపై నుంచి నడిచి వెళ్లాయి. దీంతో ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ మధ్యకాలంలో అనగూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు అడవులను దాటి బయటి ప్రాంతాల్లోకి వస్తున్నాయని, విషయం తెలియగానే, వాటిని అడవుల్లోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. 

Odisha
Elephants
One Family
Died
  • Loading...

More Telugu News