పరాజయాల నుంచే పాఠాలు నేర్చుకున్నాను: హీరో సాయిధరమ్ తేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరాజయాల నుంచే పాఠాలు నేర్చుకున్నాను: హీరో సాయిధరమ్ తేజ్

  • నా పరాజయాలకు నేనే కారకుడిని 
  • తప్పులను సరిద్దిద్దుకుంటూ ఉంటాను
  •  అమ్మ చెప్పిన మాట కూడా అదే  
యువ కథానాయకులలో చాలామంది వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంటే, సాయిధరమ్ తేజ్ మాత్రం వరుస పరాజయాలతో సతమతమైపోయాడు. ఆ విషయాన్ని గురించే తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. " ఏ సినిమా ఎందుకు పరాజయం పాలైంది అనే విషయాన్ని గురించి ఆలోచిస్తాను. ఆ సినిమాకి సంబంధించి ఫలానా విషయంలో తప్పు చేసినట్టుగా అనిపిస్తే, మరోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తపడుతుంటాను.

 తప్పు చేశామే అనుకుని ఆగిపోకూడదనీ .. ఆ తప్పుని సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలనే మా అమ్మ చెబుతూ ఉంటుంది. ఇక తప్పు ఎక్కడ .. ఎలా జరిగినా దానికి ఇతరులను బాధ్యులను చేయడం నాకు ఇష్టం వుండదు. నా సినిమా పరాజయానికి కారకుడని నేనే అని ఒప్పుకుంటాను. పరాజయాల నుంచే పాఠాలను నేర్చుకుంటూ వెళుతుంటాను. ప్రతి పరాజయం ఒక పాఠాన్ని నేర్పుతుందనే విషయాన్ని నేను బలంగా నమ్ముతుంటాను" అని ఆయన చెప్పుకొచ్చాడు.
saidharam tej

More Telugu News