Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తప్పలేదు జున్నూ... కుమారుడికి సారీ చెప్పిన నాని!

  • రేపు విడుదల కానున్న జెర్సీ
  • చిత్రంలో కొడుకు అర్జున్ పేరుతో కనిపించనున్న నాని 
  • తప్పలేదంటూ సారీ చెప్పినట్టు పోస్ట్
నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం 'జెర్సీ' విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న నాని, తాజాగా మరో సరదా ట్వీట్ పెడుతూ, తన కుమారుడు అర్జున్ కు సారీ చెప్పాడు. ఇప్పటికే టీజర్‌, ట్రయిలర్ లతో సినీ ప్రేక్షకులను ఆకర్షించిన సినిమాలో హీరో పేరు అర్జున్. నాని కుమారుడి పేరు కూడా అర్జునే.

ఇక నాని తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలో "మా డాడీ నా పేరు దొంగిలించాడు" అని రాసి ఉన్న టీ షర్ట్‌ ను అర్జున్ వేసుకోగా, పక్కనే కూర్చున్న నాని తన టీ షర్టుపై అర్జున్‌ 36 అని రాసుంది. ఈ ఫొటోకు "సారీరా జున్ను తప్పలేదు" అని క్యాఫ్షన్‌ పెట్టాడు. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపిస్తాడు. 'మళ్లీరావా' ఫేమ్ గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.



Nani
Jersey
Arjun
Post
Sorry

More Telugu News