ఇన్ స్టాగ్రామ్ లో తొలి ఫోటో పెట్టిన హీరో ప్రభాస్!

  • ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా
  • తొలి పోస్ట్ పెట్టిన ప్రభాస్
  • బాహుబలి చిత్రం స్టిల్
ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాను తెరిచిన హీరో ప్రభాస్, ఇంతవరకూ ఒక్క పోస్ట్ ను కూడా పెట్టలేదన్న విమర్శల నుంచి తప్పించుకున్నారు. తన సూపర్ హిట్ మూవీ 'బాహుబలి' రెండో భాగానికి సంబంధించిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. రెండో భాగంలో రెండు కత్తులను రెండు చేతులతో పట్టుకున్న దృశ్యానికి సంబంధించిన చిత్రాన్ని ప్రభాస్ షేర్ చేసుకోగా, ఇకపై మరిన్ని ఫోటోలు, అప్ డేట్స్ ఇస్తుండాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది నిజంగా ప్రభాస్ అఫీషియల్ ఖాతా అయితే, సెలబ్రిటీలు ఎవరూ ఎందుకు ఫాలో కావడం లేదని ప్రశ్నిస్తున్నారు కూడా.
Go Back to Shorts
Prabhas
Instagram
Bahubali
First Post

More Telugu News