భారత ప్రపంచకప్ జట్టులో పంత్ పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయా: పాంటింగ్
- పంత్ చాలా నిరాశ చెంది ఉంటాడు
- అతడిలో చాలా నైపుణ్యం ఉంది
- కనీసం మూడు ప్రపంచకప్‌లు అయినా ఆడాలి
పంత్‌కు బదులుగా దినేశ్ కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. జట్టును ప్రకటించిన తర్వాత సోమవారం రాత్రి పంత్‌ను పాంటింగ్ కలిశాడు. ‘‘జట్టులో పంత్ పేరు లేకపోవడం చూసి నిజంగా ఆశ్చర్యపోయా’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. పంత్‌లో ఎంతో నైపుణ్యం ఉందన్న పాంటింగ్.. పంత్ తన కెరీర్లో కనీసం మూడు ప్రపంచకప్‌లు ఆడకపోతే అది ఆశ్చర్యమేనన్నాడు. జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై పంత్ తీవ్రంగా నిరాశ చెంది ఉంటాడని పాంటింగ్ పేర్కొన్నాడు.